హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు శాఖలో పదోన్నతులకు ఏడున్నరేండ్ల తర్వాత గ్రహణం వీ డింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో ఆదివారం ఏకంగా 2,263 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. జూనియర్ లైన్మ న్ నుంచి సీజీఎం వరకు పదోన్నతులు కల్పిస్తూ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూ ఖీ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఒకరికి జాయింట్ సెక్రటరీగా ఉద్యోగోన్నతి కల్పించారు.
జీఎం నుంచి సీజీఎంలుగా ఇద్దరికి, ఎస్‌ఏవో నుంచి జీఎంలుగా మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. మరో 8 మంది డీఈలకు ఎస్ఈలుగా, 30 మంది ఏడీఈలకు డీఈలుగా, 58 మంది ఏఈ/ఏఈఈలకు ఏడీఈలుగా పదోన్నతు లు కల్పించారు. జేఎల్ఎం స్థాయి నుంచి ఏఎల్ఎంలుగా 1650 మందికి ప్రమోషన్ కల్పించారు. అకౌంట్స్ విభాగాల్లో వివిధ క్యాటగిరీల్లో 50 మందికి పదోన్నతులు క ల్పించారు.
ఆపరేషన్, మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగంలో మరికొందరికి పదోన్నతులు కల్పించారు. త్వరలోనే బదిలీల ను చేపట్టి వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఆయా పోస్టులు ఖాళీ కావడంతో త్వరలోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేసేందుకు వీలుపడనున్నది. పదోన్నతుల విషయంలో కొన్నిసంఘాలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పదోన్నతులు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈజేఏసీ) ప్రతినిధులు శనివారం సీ ఎండీ ముషారఫ్‌కు సూచించారు. 2,500 మందికి పదోన్నతుల ప్రక్రియ చేపట్టారు.
సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు
సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పదోన్నతులు కల్పించడంతో విద్యుత్తు ఉద్యోగులు ఆదివారం మింట్ కంపౌండ్‌లో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకం చేయడమే కాకుండా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు. సంబురాల్లో జేఏసీ కో చైర్మన్ పీ అంజయ్య, కో కన్వీనర్ రామేశ్వరయ్యశెట్టి, సీజీఎంలు మోహన్‌రెడ్డి, కామేశ్, కృష్ణారెడ్డి, టీఈజేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.