Municipal Commissioners | రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ..!
Municipal Commissioners | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ నుంచి జీహెచ్ఎంసీకి బీ గీతను బదిలీ చేసింది.
Municipal Commissioners | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ నుంచి జీహెచ్ఎంసీకి బీ గీతను బదిలీ చేసింది. సీడీఎంఏ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా టీ మోహనకృష్ణ రెడ్డిని నియమించింది. బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్‌గా బీ సుమన్‌రావు, రామగుండం కార్పొరేషన్ కమిషనర్‌గా సీహెచ్ నాగేశ్వర్‌గా బదిలీ చేసింది.
పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ.. తుర్కయాంజల్ కమిషనర్‌గా నియమించింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా కే నారాయణరావుగా బదిలీ చేయగా.. దమ్మాయిగూడ కమిషనర్ ఏ స్వామికి ఉద్యోన్నతి కల్పిస్తూ పాల్వంచ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. మిర్యాలగూడ కమిషనర్ పీ రవీంద్ర సాగర్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బదిలీ చేసింది. జీ రాజేంద్ర కుమార్‌ను నగరం కమిషనర్‌గా, పోచారం అసిస్టెంట్ కమిషనర్ ఏ సురేష్‌ను జీహెచ్ఎంసీకి, ఎండీ సాబీర్ అలీని ఘట్కేర్సర్ కమిషనర్‌గా నియమించింది.
ఎంపీ పూర్ణచందర్రెడ్డిని మిర్యాలగూడ, ఎస్ రవీంద్రరెడ్డిని పెద్దఅంబర్‌పేట, బీ సత్యనారాయణరెడ్డిని ఖమ్మం, కే వేణుమాధవ్‌ను నందికొండ, పీ వేమన్‌రెడ్డిని పోచారం కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆర్ త్రయంబకేశ్వర్‌ను రామగుండం డిప్యూటీ కమిషనర్‌గా, ఎస్ రాజమల్లయ్యను దమ్మాయిగూడ కమిషనర్‌గా నియమించింది. ఇబ్రహీంపట్నం కమిషనర్ మహ్మద్ యూసఫ్‌ను పదోన్నతిపై జీహెచ్ఎంసీకి పంపింది. ఆర్ రాజశేఖర్‌ను హుస్నాబాద్‌కు ఏ వెంకటేశ్‌ను కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్‌గా, మీర్‌పేట కమిషనర్‌గా ఏ వాణి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

