తాడ్వాయి, జూన్ 27 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం అంకంపల్లిలో శనివారం పిడిగు పడి 22 ఆవులు మృతి చెందాయి. అంకంపల్లికి చెందిన రైతు మంకిడి సమ్మయ్య గ్రామ సమీపంలోని తన పొలంలో దొడ్డిని ఏర్పాటు చేసుకొని పశువులను అక్కడే కట్టేసేవాడు. శుక్రవారం ఆవుల నుంచి పాలు తీసుకుని దొడ్డిలో కట్టేసి ఇంటికెళ్లాడు.
అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో 3గంటల పాటు భారీ వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పెద్దశబ్దంతో పిడుగులు పడ్డాయి. సమ్మయ్య దొడ్డి వద్దకు వెళ్లేసరికి 21ఆవులతో పాటు దుక్కిటెద్దు మృత్యువాత పడటం చూసి గుండెలవిసేలా రోదించాడు.