హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): ఈ నెల 28 నుంచి వచ్చే జనవరి ఆరో తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలు చేయనున్న ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం ఆదివారం రూ.22.93 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమ అమలులో భాగంగా రవాణా, మౌలిక సౌకర్యాలు, ఇతర ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి, మున్సిపల్ వార్డుకు రూ.10 వేల చొప్పున ఖర్చు చేయనున్నారు.
విడుదలైన నిధుల వివరాలు