హైదరాబాద్/చిక్కడపల్లి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో సెక్షన్ 163 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన 21మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై డీజీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం ఇందిరాపార్క్‌వద్ద ధర్నాలో పాల్గొన్న 21 మంది కానిస్టేబుళ్లపై రెండు కేసులు నమోదు చేసి, యూనిఫామ్‌లో డిసిైప్లెన్ను ఉల్లంఘించారని నోటీసులు జారీ చేశారు. ధర్నా చౌక్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న 21 మంది బెటాలియన్ పోలీసులను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.