Universities | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్యుల కొరత వేధిస్తున్నది. కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడం, ఉన్న వారు రిటైర్డ్ అవుతుండటంతో ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. 12 వర్సిటీల్లో 2,817 టీచింగ్ పోస్టులుంటే 2,060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుడు ఖాళీల సంఖ్య 1,977 ఉండగా, ఏడాది లో 2వేలు దాటాయి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాదిలో వందకు పైగా ఆచార్యులు రిటైర్ అయ్యారు. ఓయూలో 53 విభాగాలుండగా, 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 27 విభాగాలున్న కేయూలో 80 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇటీవలే ఏర్పాటైన చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో 25 మంది పనిచేస్తున్నారు.
179 టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. జేఎన్టీయూకు అ నుబంధంగా వనపర్తి, పాలేరు, సిరిసిల్ల, మహబూబాబాద్‌లో కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. పాలమూరు వర్సిటీల్లో ఇంజినీరింగ్, లా కాలేజీలను ప్రారంభించారు. దీంతో మరో వెయ్యి వరకు కొత్త పోస్టులను మంజూరు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. రిక్రూట్మెంట్పై ప్రభుత్వం ఏదీ తేల్చడంలేదు. వర్సిటీల వారీగానా.. ? కామన్బోర్డా? అన్నది చెప్పడంలేదు. పలు వర్సిటీలకు రిజిస్ట్రార్లను నియమించలేదు. త్రిసభ్య కమిటీని కసరత్తు పూర్త య్యి స్పష్టత వచ్చే వరకు మరికొంత స మయం పట్టనుంది. ఈ మధ్యకాలంలో మరికొంత మంది రిటైర్ కానున్నారు.