హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో రెండు రోజులుగా జరుగుతున్న తెలంగాణ విద్వత్సభ ఆరో వార్షిక సమ్మేళనం ఆదివారం ముగిసింది. ఈ సమ్మేళనంలో 100 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు పాల్గొన్నారు. వచ్చే ఏడాదితోపాటు 2024లో వచ్చే కొన్ని పండుగల తేదీలను ఈ సమ్మేళనంలో నిర్ణయించినట్టు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి మరుమాముల వెంకటరమణ శర్మ వెల్లడించారు.