వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకోని స్వామి వారి కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలతో అలంకరించి పచ్చని పందిరిలో ముత్యాల తలంబ్రాలు పోసి వేద బ్రహ్మణుల మంత్స్రోరణల మధ్య కల్యాణం కనులపండుగగా జరిగింది.
స్థానిక సర్పంచ్ పోగుల ఆంజనేయులు శ్రావణి దంపతులు కల్యాణ గట్టం నిర్వహించారు. అంతకు ముందు స్వామి వారి ఎదురుక్కోలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులకు ఓడిబియ్యం పోశారు. కల్యాణోత్సవానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఇతర మండలాల భక్తులు వేలాదిగా తరలివచ్చి స్థానిక గుండంలో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకోని కల్యాణం తిలకించి ఆలయంలో పూజలు నిర్వహించారు.
వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో అటవీశాఖ రేంజర్ కిరణ్‌కుమార్ తన సిబ్బందితో కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అటవీశాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం వరకు రోడ్డును పునరుద్దరించడంతో పాటు త్రాగునీటి వసతి ఇతర సదుపాయాలను కల్పించారు.
తాజావార్తలు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్‌టాక్ స్టంట్