ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 13:40:59

మధ్య మానేరులో చేప పిల్లల విడుదల

మధ్య మానేరులో చేప పిల్లల విడుదల

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రాజరాజేశ్వర ప్రాజెక్టులో మత్స్యశాఖ అధికారులు చేప పిల్లలను విడుదల చేశారు. సుమారు 20 లక్షల వరకు చేప పిల్లలు విడుదల చేసినట్టు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో మధ్య మానేరు ప్రాజెక్ట్ లో ఎంపీపీ పడగల మానస 8 లక్షల చేప పిల్లలు వదిలారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల రవీందర్, ఎంపీటీసీ నలువల రేణుక, టీఆర్ఎస్ నేత జక్కుల నాగరాజు మత్స్యశాఖ అధికారులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఉన్నారు.


logo