బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 15:21:44

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

నిర్మల్ : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం గండి రామన్న హరితవనం పార్కులో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. అలాగే నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు.  అనంతరం నూతనంగా ప్రారంభo కానున్న నాగభైరవ సీరియల్ షూటింగ్ ను మంత్రి క్లాప్ కొట్టి  ప్రారంభిoచారు.logo