మేడారం పనుల్లో 200 కోట్ల స్కామ్
మేడారం జాతర పనుల్లో మంత్రులు సీతక్క, పొంగులేటి కలిసి రూ. 200 కోట్ల కుంభకోణం చేశారని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సంచలన ఆరోపణలు చేశారు.
- పూజారి కొడుకు ప్రమాదానికి మంత్రి సీతక్కదే పూర్తి బాధ్యత
- రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): మేడారం జాతర పనుల్లో మంత్రులు సీతక్క, పొంగులేటి కలిసి రూ. 200 కోట్ల కుంభకోణం చేశారని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సంచలన ఆరోపణలు చేశారు. నాసిరకమైన రాతికట్టడాలు కుప్పకూలుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఆలయ పూజారి రమేశ్ కొడుకు సమ్మక్క గద్దెశిల కూలి తీవ్రంగా గాయపడ్డాడని శుక్రవారం ప్రకటనలో గుర్తుచేశారు. ఈ ప్రమాదానికి మంత్రి సీతక్క బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంత్రుల అక్రమ ధన దాహానికి పూజారి కొడుకు యువిన్ రెండు కాళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
బాలుడి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యాతాలోపంతో పనులు చేసి, వనదేవతలను అవమానించినందుకు మంత్రి యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మేడారం అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. లేదంటే ఈ అక్రమపర్వంలో ముఖ్యమంత్రికి సైతం వాటా ఉందని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

