గంగాధర, నవంబర్ 22 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం భోజనం చేసిన తర్వాత ముగ్గురు కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు.
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు.