ఏసీబీ డీజీగా ఆనంద్
రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
- ఎస్ఐబీ డీఐజీగా సుమతి
- డీజీపీగా రవిగుప్తాకు పూర్తి బాధ్యత
- రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్గాఅంజనీకుమార్
- జైళ్లశాఖ డీజీగా సౌమ్యమిశ్రా
- 20 మంది ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ఫలితాల వేళ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రవిగుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు 14మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఎన్నికల ఫలితాల వరకు డీజీపీగా కొనసాగిన అంజనీకుమార్‌ను రోడ్డు భద్రత విభాగానికి చైర్మన్‌గా నియమించింది. అదనంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా బదిలీ అయిన పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

Tspolice
14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు
తెలంగాణలో 2015 బ్యాచ్‌కు చెందిన 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న 14 మందికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ సేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పించింది. ఈ పదోన్నతి ఉత్తర్వులు 2024 జనవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రమోషన్ పొందిన వారిలో రమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పోట్రు, రాహుల్ రాజ్, భావేశ్ మిశ్రా, సత్యశారదాదేవి, నారాయణరెడ్డి, ఎస్ హరీశ్, జీ రవి, కే నిఖిల, ఆయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసిన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీలుగా శేషాద్రి, రిజ్వీలకు ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐఏఎస్ అధికారి ఏ శ్రీదేవసేనకు సెక్రటరీగా సూపర్ టైమ్ స్కేల్ (లెవల్-14 పే మ్యాట్రిక్స్) పదోన్నతి కల్పించింది. అలాగే 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పాటిల్ ప్రశాంత్ జీవన్, కిల్లు శివకుమార్ నాయుడులకు సెలెక్షన్ గ్రేట్ (లెవల్ -13 పే మ్యాట్రిక్స్) పదోన్నతి కల్పించింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

