Nagarjuna Sagar | నల్లగొండ : నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. 26 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1,92,648 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 309.95 టీఎంసీలుగా ఉంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది.
ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..
రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బుధ, గురువారాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.