మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 2 : విద్యుత్‌శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు (సబ్ స్టేషన్ల నిర్వాహకులు) మూకుమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర జేఏసీ నాయకుల కన్వర్షన్ యాత్రను మహబూబ్‌నగర్ నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్ర కమిటీ చైర్మన్ ఈశ్వర్రావు, కన్వీనర్ వాజీర్, కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటన తర్వాత ఈ నెల 20న ఉదయం 11 గంటలకు చలో విద్యుత్‌సౌధ కార్యక్రమం చేపడుతున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రస్థాయి మూడో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ చూపిన పోలీసులకు జాతీయస్థాయిలో శిక్షణ ఇస్తామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఐదు రోజులుపాటు కరీంనగర్లో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఇటీవల ముగిశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి, డీఎస్పీలుగా ఉన్న క్రికెటర్ సిరాజ్, మహిళా బాక్సర్ నికత్ జరీన్ల పర్యవేక్షణలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పోటీల్లో గెలిచిన వారికి నగదుతోపాటు ఇంక్రిమెంట్లు ఇస్తామని తెలిపారు.