హనుమకొండ సబర్బన్, జనవరి 20: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో రెండు అవార్డులు లభించాయి. 88వ స్కోచ్ సదస్సులో సంస్థ వైస్ చైర్మన్ గురుశరణ్ దంజల్ ఈ అవార్డులను ఆన్లైన్లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు మాట్లాడుతూ.. రెండు స్కోచ్ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు.
ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఎనర్జీ ఇన్ టీఎస్ఎన్పీడీసీఎల్ క్యాటగిరీల్లో అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. సీఎం ముందు చూపుతోనే తెలంగాణ వెలుగుల రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. ఎన్పీడీసీఎల్కు అన్ని క్యాటగిరీల్లో అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు.