హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిసోతో ఉత్తమ్ భేటీ అయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సోనా పట్ల ఫిలిప్పీన్స్ ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు.
యూరియా సరఫరా చేయాలి ; కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : కేటాయింపుల ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన యూరియాను ఆలస్యం చేయకుండా సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తిచేశారు. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 16.5 శాతానికి తగ్గించడంతో పామాయిల్ గెలల ధర తగ్గిందని, దీనిపై పునఃసమీక్షించి దిగుమతి సుంకాన్ని 44శాతానికి పెంచాలని కోరారు.