Nizamabad | నిజామాబాద్‌లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పారిపోయింది. అయితే ఆ ముఠాను వెంబడించిన పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
స్మగ్లర్ల కారు ఢీకొట్టడంతో కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టిన అనంతరం పారిపోతున్న స్మగ్లర్లను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దర్ని నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.