Bihar Graduate | పాట్నా: బీహార్ యువకుడు అభిషేక్ కుమార్‌కు గూగుల్ లండన్ కార్యాలయంలో రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీ లభించింది. ఆయన వచ్చే నెలలో ఉద్యోగ బాధ్యతలను స్వీకరిస్తారు. ఆయన పాట్నాలోని ఎన్ఐటీలో బీటెక్ చేశారు. ‘ఇది నా అతి గొప్ప విజయం. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్‌లో పని చేయడం ఓ స్వప్నం. ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది’ అని అభిషేక్ చెప్పారు. అభిషేక్ 2022లో అమెజాన్‌లో రూ.1.08 కోట్ల ప్యాకేజీ పొందారు. అక్కడ ఆయన 2023 మార్చి వరకు పని చేశారు. ఆ తర్వాత జర్మన్‌కు చెందిన ఫారిన్ ఎక్సేంజ్ ట్రేడింగ్ యూనిట్లో జాయిన్ అయ్యారు.