శంషాబాద్ రూరల్, జనవరి 1: శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం రూ.2.9 కోట్ల విలువైన కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వేర్వేరు విమానాల్లో వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై అనుమానం రావడంతో అధికారులు వారి లగేజీని తనికీ చేయగా, ఒక కిలో 459 గ్రాముల బంగారం లభించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.