హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా లో అక్రమంగా నిల్వచేసిన 77 క్వింటాళ్ల రేషన్ బియాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సిటీ-2 యూనిట్‌కు చెందిన విజిలెన్స్ అధికారులు గద్వాల జిల్లా లీజా, గాజులపేటలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 77 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు.