హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 21 మంది పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉండగా.. మిగిలిన 15 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్గా గౌస్ అలం, నిజామాబాద్ కమిషర్గా సాయి చైతన్య, రామగుండం కమిషర్గా అంబర్ కిశోర్ ఝా నియమితులయ్యారు. కాగా, కరీంనగర్ సీపీగా ఉన్న అభిషేక్ మొహంతీని రిలీవ్ చేయాలని ఇటీవల కేంద్రం కోరగా.. ఆయనను తెలంగాణ క్యాడర్ నుండి రిలీవ్ చేశారు.