అలంపూర్, అక్టోబర్ 26 : కర్నూలు జిల్లా చిన్న టేకూరు శివారు 44వ జాతీ య రహదారిపై శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది అగ్నికి ఆహుతై న విషయం విదితమే. గుర్తుపట్టలేని స్థితి లో ఉన్న మృతదేహాల మాంసపు ముద్దలను.. వారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్షల అనంతరం ఆదివారం వారివారి కుటుం బ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అందజేసి, మృతదేహాలను అంబులెన్స్‌లో వారివారి ప్రాంతాలకు తరలించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు.
1.చందన మంగ, తండ్రి శ్రీవలీబ్గౌడ్ మంగ, శ్రీనివాసనగర్, హెచ్ఎంటీ రోడ్, హైదరాబాద్.
2.సంధ్యారాణి, హెచ్ఎంటీ రోడ్, హైదరాబాద్
3.మేఘనాథ్, శ్రీనివాసనగర్, కోదాడ
4.అనూష, వస్త కొండూర్, గుండాల మండలం, నల్లగొండ జిల్లా
5.బొంత ఆదిశేషగిరిరావు, సాయి దత్తా ఎన్క్లేవ్, హైదర్‌గూడ, రంగారెడ్డి జిల్లా
6.కీనుగ దీపక్ అంబదాల, రాయగఢ్ మద్యం మత్తులో బైకర్ శివశంకర్
కర్నూలు జిల్లా, లెందకొండ,పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న టేకూరు వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి శివశంకర్ మద్యం మత్తులో ఉండి బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై మృతి చెందినట్టు ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం మృతుడి విస్సేరా నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందనని తెలిపారు.