హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విజయవంతంగా హరితహారం అమలుతో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.7% పెరిగిందని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం హరితహారం ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో పెద్దఎత్తున మొక్కలు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 19,400 పల్లెప్రకృతి వనాలు ఉన్నాయని, ఇప్పటివరకు ఏర్పాటుచేయని గ్రామాల్లో వెంటనే మొదలుపెట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటుచేయాలని కోరారు. పట్టణ పచ్చదనం పెంపుకోసం ప్రతి మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మొక్కలకు నీటిసౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపు, పదిశాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనం పెంచడం అత్యంత ప్రాధాన్య అంశమని, వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 14,695 నర్సరీలలో సుమారు 32.99 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
రేవంత్ అన్నది..
‘సీఎం కేసీఆర్ తన వ్యూహాలపై నమ్మకం కోల్పోయి సునీల్ అనే స్ట్రాటజిస్ట్‌ను తెచ్చిపెట్టుకున్నారు. ఆయన డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తా’
– 2021 డిసెంబర్ 22న రేవంత్ రెడ్డి
రేవంత్ అన్నది..
టీఆర్ఎస్తో పీకే తెగతెంపులు చేసుకుంటున్నారు. నేను, పీకే కలిసి త్వరలో ఉమ్మడి ప్రెస్‌మీట్ పెడతాం. టీఆర్ఎస్ను ఓడించండి అని పీకే స్వయంగా చెప్తాడు.
– ఈ నెల 25న రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
జరిగింది ఇదీ..
సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో మీరంతా పనిచేయాలి. ఆయనకు పూర్తిగా సహకరించాలి.
– ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ
జరిగింది ఇదీ..
నేను కాంగ్రెస్‌లో చేరడం లేదు. ఆ పార్టీకి నా అవసరం లేదు. ఆ పార్టీకి నాయకత్వం, సమిష్టి దీక్ష కావాలి.
– ఈ నెల 26న ప్రశాంత్ కిశోర్ ట్వీట్