శ్రీరాంపూర్, జనవరి 17 : హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌వో) 183వ బోర్డు సమావేశం మొదటిసారిగా జరిగింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎంపీఎఫ్‌వో (బీవోటీ) చైర్మన్ విక్రమ్ దేవ్‌దత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొగ్గుగని కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీవోటీ చైర్మన్ విక్రమ్ దేవ్‌దత్ మాట్లాడుతూ పింఛన్ నిధి సుస్థిరతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సీఎంపీఎఫ్‌వో వనరుల ప్రాముఖ్యత ను వివరించారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఎం ప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి నిధులు వినతిపత్రం అందించారు.