Snake Bite | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఓ 18 నెలల చిన్నారి పాము కాటుకు బలైంది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం అసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రమేశ్, సుమలత అనే దంపతులు తమ బిడ్డ(18 నెలలు) వేదాన్షితో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే పసిపాప శనివారం రాత్రి తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, పాము కాటేసింది. చిన్నారి ఆ నొప్పి భరించలేక గట్టిగా ఏడ్చింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పాపను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
వేదాన్షి మృతితో రమేశ్, సుమలత గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.