హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): పోలీస్‌శాఖలోని ఏఆర్ విభాగానికి చెందిన 8 మంది అడిషనల్ ఎస్పీలు, 24 మంది డీఎస్పీ(సివిల్)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
బదిలీల్లో వెయింటింగ్‌లో ఉన్న 18 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్‌లు లభించాయి. అలాగే, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన 14 మంది అడిషనల్ కమాండెంట్లను పలు ప్రాంతాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.