సింగరేణి కార్మికునికి 6.5 లక్షలు
సింగరేణి ఉద్యోగుల కు నెల రోజుల వ్యవధిలో రూ.1726 కోట్ల వేజ్‌బోర్డు బకాయిలు, ఆ వెంట నే రూ.700 కోట్ల లాభాల వాటా, ఆపై రూ.300 కోట్ల దీపావళి బోనస్ చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. సుమారు రూ.2800 కోట్ల వరకు చెల్లింపులు చేయనున్నామని,
- బకాయిలు, లాభాల వాటా, దీపావళి బోనస్‌కు ఏర్పాట్లు
- నెల రోజుల్లో రూ. 2800 కోట్ల చెల్లింపులకు చర్యలు
- సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమ స్తే తెలంగాణ): సింగరేణి ఉద్యోగులకు నెల రోజుల వ్యవధిలో రూ.1726 కోట్ల వేజ్‌బోర్డు బకాయిలు, ఆ వెంట నే రూ.700 కోట్ల లాభాల వాటా, ఆపై రూ.300 కోట్ల దీపావళి బోనస్ చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. సుమారు రూ.2800 కోట్ల వరకు చెల్లింపులు చేయనున్నామని, సగటున ఒక్కో కార్మికుడు సుమారు రూ.6.5 లక్షలు అందుకోనున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో రాను న్న రోజుల్లో మరింత కష్టపడి లక్ష్యాలను సాధించాలని సీఎండీ సూచించారు. వచ్చే మార్చికల్లా 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయాలని ఆదేశించారు.
సోమవారం సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జీఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎండీ మాట్లాడారు. నిరుటితో పోల్చితే ఈ ఏడాది మొదటి ఐదు నెలల కాలంలో మెరుగైన బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించి లక్ష్యం దిశగా సాగుతున్నారని సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. రానున్న ఏడు నెలల కాలంలో ప్రతి ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాల వల్ల ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ.. గనుల్లో నిలిచే నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉత్పత్తికి విఘాతం లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్టు ఎన్ బలరామ్, డీ సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్లు, అడ్వైజర్లు డీఎన్ ప్రసాద్, సురేంద్ర పాండే, ఈడీ జే ఆల్విన్, జీఎంలు సురేశ్, జక్కం రమేశ్, మల్లెల సుబ్బారావు, దేవేందర్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

