హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజే పరీక్షలకు 17, 010(3.42%) మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. బుధవారం ఫస్టియర్ విదార్థులకు రెండో భాష పేపర్ పరీక్ష నిర్వహించగా, సెట్-బీ పేపర్‌ను ఎంపికచేశారు. 5,14,184 మంది విద్యార్థులకు 4,96, 899 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిరోజే హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఒక్కో విద్యార్థి చొప్పున ఇద్దరు డిబార్ అయ్యారు. గురువారం నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజు బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య పలు సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని రత్నా జూనియర్ కాలేజీ, జాహ్నవి, శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించారు. బోర్డు నియమించిన పరిశీలకులు పలు జిల్లాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 10 నుంచి ప్రారంభించనున్నారు. మూల్యా ంకన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సంస్కృత పేపర్లతో ఈ మూల్యాంకనం ప్రారంభంకానున్నది. 22నుంచి మొదటి విడత, 24 నుంచి రెండో విడత, 26 నుంచి మూడో విడత, 28 నుంచి నాలుగో విడత మూల్యాంకనాన్ని ప్రారంభిస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. ఇది వరకు 17 చోట్ల మూల్యాంకన క్యాంపులుండగా, ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా మెదక్, వరంగల్ జిల్లాల్లో రెండు క్యాంపులు ఏర్పాటుచేయనున్నారు. దీంతో మూల్యాంకన క్యాంపుల సంఖ్య 19కి చేరనున్నది.
హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల కానున్నది. అభ్యర్థులు ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 550, బీసీ, జనరల్ విద్యార్థులు రూ.750 ఫీజుగా చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 8, 9న పరీక్షలు నిర్వహిస్తామని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రవి తెలిపారు.