మౌజన్..ఇమామ్‌ల వేతనగోస!
రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో పనిచేస్తున్న మౌజన్లు, ఇమామ్‌లు గౌరవ వేతనాల కోసం అరిగోసపడుతున్నారు. తరుచూ వేతనాలు ఆలస్యమ వుతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరిసారిగా గత మార్చికి సంబంధించిన వేతనాలు చెల్లించారు. దీంతో 16,379 మంది ఏడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
- ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
- తరుచూ వేతనాలు ఆలస్యం
- కొన్నిచోట్ల మసీదుల కమిటీల ఖాతాల్లో జమ
- మొరపెట్టుకున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో పనిచేస్తున్న మౌజన్లు, ఇమామ్‌లు గౌరవ వేతనాల కోసం అరిగోసపడుతున్నారు. తరుచూ వేతనాలు ఆలస్యమ వుతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరిసారిగా గత మార్చికి సంబంధించిన వేతనాలు చెల్లించారు. దీంతో 16,379 మంది ఏడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ హయాంలోనే గౌరవం
రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో సుమారు 17,000 మంది మౌజన్లు, ఇమామ్‌లు పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరి సంక్షేమాన్ని అప్పటి పాలకులు పట్టించుకోనేవారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దేవాల యాల్లో పూజలు చేసే అర్చకులతోపాటు మసీదుల్లో నమాజ్ నిర్వహణ, అజాకు సిద్ధం చేసే మౌజన్, ఇమామ్‌లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. స్టేట్ వక్ఫ్‌బోర్డు ద్వారా అమలు చేయాలని నిశ్చయించింది. మొదట గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున ఇచ్చి ఆర్థికంగా తోడ్పాడు నందించింది. 2018లో ఆ మొత్తాన్ని రూ.5,000కు పెంచింది. సుమారు 17 వేల మందికి వర్తిం పజేసింది. అర్హులైన మౌజన్, ఇమామ్‌లకు ప్రతినెలా ఉద్యోగుల మాదిరిగా వారి ఖాతాల్లో రూ.5,000 చొప్పున గౌరవవేతనం జమచేసేది.
పెంచుతామని ఆశచూపిన కాంగ్రెస్
అధికారంలోకి రాగానే మౌజన్, ఇమామ్‌ల వేతనాన్ని రెట్టింపు అంటే రూ.10 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడంలేదు. గౌరవ వేతనాలను కూడా సక్రమంగా అందించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభు త్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నా, నిధుల విడుదలలో తాత్సారం చేస్తున్నదని మౌజన్లు చెప్తున్నారు. 2026 ఫిబ్రవరిలో 16, 379 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 2025 డిసెంబర్ నెలకు సంబంధించి రూ.8.19 కోట్లు జమచేశారు. ఆ తర్వాత 2026 ఏప్రిల్‌లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన రూ. 24.45 కోట్లు విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి వేతనాలు జమకావడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
మసీదుల కమిటీల ఖాతాల్లోకి వేతనాలు
మౌజన్, ఇమామ్‌లకు సంబంధించిన గౌరవ వేతనాలు మసీదుల కమిటీల ఖాతాల్లోకి వెళ్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీల బాధ్యులు లబ్ధిదారులకు ఇవ్వకపోవడమో, లేదంటే కొంతమేర కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు అందాయని సమాచా రం. వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని గౌరవవేతనం పక్కదారి పట్టకుండా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

