హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని సాహితీ ఇన్ఫ్రాకు చెందిన రూ.161.50 కోట్ల ఆస్తులను జఫ్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం తెలిపింది. గతంలో రియల్ ఎస్టేట్ కేసుకు సంబంధించి సాహితీ ఇన్ ఫ్రాతోపాటు సంబంధిత సంస్థలు, ప్రమోటర్ల ఇండ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీటిల్లో డబ్బులు తీసుకొని ప్లాట్లు ఇవ్వలేదని గుర్తించినట్టు తెలిపారు.
దశలవారీగా కోట్లాది రూపాయలు వసూలు చేశారని గుర్తించారు. అమీన్పూర్లో బిల్డింగ్ పేరుతో రూ.89 కోట్లు వసూలు చేయడంతో పాటు మరో రూ.126 కోట్లను వ్యక్తిగతంగా వాడుకొన్నట్లు ఈడీ గుర్తించింది. సాహితీ ఇన్ఫ్రా సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావుకు చెందిన చర, స్థిర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసు నమోదు చేసింది.