మాచారెడ్డి, ఆగస్టు 29: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కామారెడ్డి పల్లెలన్నీ మద్దతుగా నిలుస్తున్నాయి. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ‘మీ వెంటే మేముం టాం’ అని నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలా ల్లో కేసీఆర్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే తమ గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయా గ్రామాల్లోని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సారే రావాలి.. కారే గెలవాలి అనే పట్టుదలతో కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి.
ఇప్పటికే 16 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు
కామారెడ్డి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్‌ను గెలిపించుకుంటామని ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని 16 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేశా యి. ఎల్లంపేట, నడిమితండా, నెమ్లిగుట్టతండా, బోడగుట్టతండా, అంకిరెడ్డిపల్లితండా, మైసమ్మచెరువుతండా, గుంటితండా, ఒడ్డెరగూడెం తండా, రాజ్‌ఖాన్‌పేట, మంథనిదేవునిపల్లి గ్రామాలు ఇప్పటికే తీర్మానించాయి. పాల్వంచ మండలం ఆరెపల్లిలోని ఏలేటివారి సంఘం, గడ్డంవారి సంఘం, వెలమ, పద్మశాలి, ముదిరాజ్, ఎస్సీ, గొల్ల, కురుమ, గౌడ, యూత్ సంఘాలతోపాటు లక్ష్మీరావులపల్లిలో అధికంగా ఉన్న ముదిరాజ్‌లు కేసీఆర్‌కు ఓటు వేస్తామని తీర్మానించారు. ఆ ప్రతులను ఎం పీపీ నర్సింగ్‌రావు, జడ్పీటీసీ రాంరెడ్డికి మంగళవారం అందజేశారు. వాటిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందజేస్తామని తెలిపారు.
స్వచ్ఛందంగా ర్యాలీలు
సీఎం కేసీఆర్‌కు మద్దతునిస్తూ తీర్మానాలు చేయడమే కాకుండా ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం మాచారెడ్డి మండలంలోని ఆరేపల్లిలో ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ‘జై కేసీఆర్- జైతెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు తప్ప ఇతర ఏ పార్టీకి ఓటెయ్యబోమని ప్రతినబూనారు.
గ్రామాగ్రామాన కేసీఆర్‌కు మద్దతు
ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామా ల్లో తీర్మానాల జోరు కొనసాగుతున్నది. దేశంలోనే ఏ నేతకు లభించని విధంగా సీఎం కేసీఆర్‌కు ఏకగ్రీవ తీర్మానాలతో స్వాగతం పలుకుతున్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం తమ ప్రాంతానికి దక్కిన అరుదైన గౌరవమని చెప్తున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల కన్నా రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు.
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం మా అదృష్టం
సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తామని ప్రకటించడం మా అదృష్టం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ మాకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ సార్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం.
-ఎల్దండి గణేశ్, ఆరెపల్లి, పాల్వంచ మండలం
భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం
సీఎం కేసీఆర్ సార్‌ను భారీ మెజారిటీ తో గెలిపించుకుంటాం. మా గ్రామంలో అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు అందిస్తూ ఆసరాగా ఉంటున్నారు. ఇక్కడి నుంచి కేసీఆర్ సార్ పోటీ చేస్తానన్న విషయం టీవీల్లో చూసి తెలుసుకున్నాం. మా ఊరి నుంచి కేసీఆర్ సార్‌కు భారీ మెజారిటీతో ఇస్తాం.
-తాడూరి అశోక్, ఆరెపల్లి, పాల్వంచ మండలం.