హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లకు పోషకాహార పథకం(ఎస్ఎన్పీ) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపు కోసం గురువారం ఆర్థికశాఖ రూ.156 కోట్లు విడుదల చేసింది.
మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సరుకులు, కూరగాయలు, గ్యాస్ సరఫరా, భవనాల అద్దె ఖర్చుల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు తెలిసింది.