హైదరాబాద్‌వాసులు సేఫ్
హైదరాబాద్ నుంచి 153 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేపాల్ వెళ్లారు. వీరి యోగక్షేమాలపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో అనారోగ్యం కారణంగా 16 మంది గదిలోనే ఉండగా, సందర్శనకు వెళ్లినవారి ఆచూకీపై తొలుత గందరగోళం నెలకొంది. అయితే వారు కూడా సురక్షితంగానే ఉన్నట్టు తెలిసింది. వరదలతో అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో వివరాలు సేకరించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.
సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి 153 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేపాల్ వెళ్లారు. వీరి యోగక్షేమాలపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో అనారోగ్యం కారణంగా 16 మంది గదిలోనే ఉండగా, సందర్శనకు వెళ్లినవారి ఆచూకీపై తొలుత గందరగోళం నెలకొంది. అయితే వారు కూడా సురక్షితంగానే ఉన్నట్టు తెలిసింది. వరదలతో అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో వివరాలు సేకరించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్‌శాస్త్రి కుటుంబం కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకుంది. ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. మానసరోవర్ యాత్ర కోసం ఈ నెల 10న కుటుంబంతో కలిసి వెళ్లినట్టు తెలిపాడు. తన బృందంలో 153 మంది ఉన్నట్టు వివరించాడు. ఈ నెల 25న మానసరోవర్ యాత్ర ముగించుకొని పరిక్రమ యాత్రకు వెళ్లేందుకు సిద్ధం కాగా తమ బృందంలో కొందరు అస్వస్థతకు లోనవడంతో ఆగిపోయినట్టు వివరించాడు. మిగిలిన వారంతా పరిక్రమ యాత్రకు వెళ్లారని, వారంతా ఇప్పుడు చైనా ఇమిగ్రేషన ప్రాంతంలోని దార్సింగ్లో సురక్షితంగా ఉన్నారని చెప్పాడు.
తెలంగాణ వాసుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు
నేపాల్‌లో చికుకున్న లేదా ఇబ్బందులు ఎదురొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అకడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఉన్న తమ వారితో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
హెల్ప్ లైన్ నంబర్లు
పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్, వందన మొబైల్: 9871999044, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ చక్రవర్తి మొబైల్: 9949351270, లైజన్ ఆఫీసర్ జీ రక్షిత్ నాయక్ మొబైల్: 9618597969
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

