హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పోలీస్‌శాఖలో 151 మంది ఎస్ఐలకు సీఐలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. పదోన్నతులు పొందిన వారిలో మల్టీజోన్ 1లో 30, మల్టీజోన్ 2లో 121 మందికి పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, మల్టీజోన్ 2 ఐజీ షానవాజ్ ఖాసిం ఉత్తర్వులు జారీ చేశారు.