హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఎంపిక చేసిన గ్రామాలను సోలార్‌మయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, బడ్జెట్లో 1,500కోట్లు కేటాయించింది. ఈ నిధులతో గ్రామాలను పూర్తిగా సోలార్ విద్యుత్తు వ్యవస్థతో అనుసంధానిస్తారు.
గ్రీన్ పవర్ వినియోగించే గ్రామాలుగా అవతరిస్తాయి. ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని పూర్తి సోలార్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి, మధిర నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికచేశారు.