
14 రోజుల ఈడీ కస్టడీకి ‘ఇండస్ వివ’వ్యవస్థాపకులు
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట రూ.1500 కోట్ల మోసానికి పాల్పడిన ఇండస్ వివ కంపెనీ వ్యవస్థాపకులు సీఏ అంజర్, అభిలాష్ థామస్‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవా రం అరెస్టు చేశారు. పిరమిడ్ ఆకారంలో వినియోగదారులను చేర్చుతూపోతే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందంటూ కంపెనీ మోసానికి తెరతీసింది. దాదాపు పది లక్షల మంది నుంచి రూ.1500 కోట్లు వసూలు చేసి కంపెనీ వ్యవస్థాపకులు బోర్డు తిప్పేశారు. మనీలాండరింగ్ చట్టాల కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రంగారెడ్డి మనీలాండరింగ్ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ నెల 30 వరకు కోర్టు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.