హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ అలగు వర్షిణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగురోజులపాటు జాతర కొనసాగనున్నది. నిధుల మంజూరుపై మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక హర్షం వ్యక్తంచేశారు. మేడారం మహాజాతను వైభవోపేతంగా నిర్వహిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించారు.