Trains Cancelled | బహనాగ బజార్ స్టేషన్లో ట్రాక్ మెయింటెనెన్స్ పనులు.. 15 రైళ్లు రద్దు
ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.
హైదరాబాద్: ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. వీటిలో విశాఖపట్నం, షాలిమార్, హైదరాబాద్, సికింద్రాబాద్, ప్రశాంతి నిలయం-హౌరా మధ్య నడుస్తున్న రైళ్లు ఉన్నాయి.
రద్దయిన రైళ్లు వివరాలు..
బుధవారం..
- విశాఖపట్నం-షాలిమార్ ఎక్స్ప్రెస్ (22854)
- షాలిమార్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (12773)
- షాలిమార్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (22849)
- హౌరా- ప్రశాంతి నిలయం ఎక్స్ప్రెస్ (22831)
గురువారం (జూన్ 15)..
- షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ (18045)
- విశాఖపట్నం-దిఘా ఎక్స్ప్రెస్ (22874)
శుక్రవారం (జూన్ 16)..
- సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్ప్రెస్ (22850)
- ప్రశాంతి నిలయం-హౌరా ఎక్స్ప్రెస్ (22832)
కాగా, దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో రైల్వే మౌలిక సదుపాయాల పనులతో అధికారులు పలు రైళ్లను రద్దుచేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దయినవాటిలో విశాఖపట్నం-రాజమహేంద్రవరం-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకరైలు (07466 / 07467), కాకినాడ-విశాఖ-కాకినాడ ఎక్స్ప్రెస్ (17267 / 68) ఉన్నాయి. ఈ రైళ్లను జూన్ 18 వరకు క్యాన్సల్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

