TG Budget | విద్యకు అరకొర నిధులే.. రాష్ట్రం మొత్తం బడ్జెట్లో 8.22శాతమే!
TG Budget | కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ.. 18% కేటాయించాలన్న తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులను సర్కార్ అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. తాజా బడ్జెట్లో 8.22% మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నది. ఈ సారి బడ్జెట్లో విద్యారంగానికి రూ. 26,674 కోట్లను సర్కార్ బడ్జెట్లో కేటాయించింది.
TG Budget | కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ.. 18% కేటాయించాలన్న తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులను సర్కార్ అస్సలు లెక్కలోకి తీసుకోలేదు. తాజా బడ్జెట్లో 8.22% మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నది. ఈ సారి బడ్జెట్లో విద్యారంగానికి రూ. 26,674 కోట్లను సర్కార్ బడ్జెట్లో కేటాయించింది.
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : నిరుటితో పోల్చితే రూ.3,566 కోట్ల కేటాయింపులు పెరుగడం గమనార్హం. దీంట్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు రూ. 500కోట్లు, బ్రేక్‌ఫాస్ట్‌కు రూ. 720కోట్లు కేటాయించింది. ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనానికి కొన్ని నిధులు వెళ్తాయి. ఇవన్నీ తీసేస్తే అరకొర కేటాయింపులేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యకు కేటాయించే బడ్జెట్ టీచర్లకే సరిపోతుందని సాక్షాత్తు రేవంత్‌రెడ్డియే వ్యాఖ్యానించారు. అంటే తాము జీతాలకు సరిపోయే కేటాయింపులు మాత్రమే చేస్తున్నామని ఆయనే ఒప్పుకొన్నారు. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం విద్యకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించడంలేదు.
అంకెల గారడీ.. అభూత కల్పనలు
విద్యారంగానికి ప్రభుత్వం బడ్జెట్లో మరోసారి మొండిచెయ్యి చూపించిందని టీచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. బడ్జెట్ లెక్కలన్నీ అంకెల గారడీ.. అభూత కల్పనలుగా అభివర్ణించారు. బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉందని, విద్యకు 8% కేటాయించడం సిగ్గుచేటని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అభిప్రాయపడ్డారు. బడ్జెట్లో విద్యారంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రకటన కరువైందని మండిపడ్డారు. విద్యకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని సదానందం గౌడ్, జుట్టు గజేందర్(ఎస్టీయూ టీఎస్), కేటాయింపులు నామమాత్రమేనని కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి(టీఆర్టీఎఫ్), విద్యారంగానికి కేటాయించిన నిధులు ఏ మూలకు సరిపోవని ఒడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య(తపస్), జనాకర్షణే తప్ప వాస్తవికత లేని బడ్జెట్ అని చావ రవి, వెంకట్ (టీఎస్ యూటీఎఫ్), ప్రభుత్వ లక్ష్యాలు గొప్పలు.. కేటాయింపులు తక్కువగా ఉన్నాయని మల్లికార్జున్‌రెడ్డి, శారద (ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్), విద్యాశాఖను రాష్ట్ర బడ్జె ట్ నిరాశపరిచిందని మహ్మద్ అబ్దుల్లా, కాంతికృష్ణ (ఆర్‌యూపీపీటీ) అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని మణిపాల్‌రెడ్డి(టీటీయూ), లింగారెడ్డి (డీటీఎఫ్), రాధాకృష్ణ (టీపీటీయూ)నిరసన వ్యక్తంచేశారు.
విద్యకు కేటాయింపులిలా.. విభాగం కేటాయింపులు (కోట్లల్లో)
- పాఠశాల విద్య 21,231
- ఉన్నత విద్య 5,443
- మొత్తం 26,674
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

