హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : న్యాయశాఖలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లకు అందించే అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయశాఖ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సీఎస్ రామకృష్ణారావు జీవో-61ని జారీచేశారు.
70-75 ఏండ్ల మధ్య గల వారికి 15%, 75-80 ఏండ్ల మధ్య వయస్కులకు 20%, 80- 85 మధ్య వారికి 30%, 85-90 ఏండ్ల మధ్య వయస్కులకు 40%, 90- 95 ఏండ్ల మధ్య వయస్కులకు 60, 95-100 ఏండ్ల మధ్య వయస్కులకు 80%, వంద ఏండ్లు దాటిన వారికి 100% అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందని పేర్కొన్నారు.