కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జైనూర్‌లో పోలీసులు పటిష్ఠ భద్రత కొనసాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతోపాటు అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్ ఎస్పీలు అఖిల్ మహాజన్, అశోక్ కుమార్, గౌస్ ఆలం, బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ రెండు రోజులుగా అక్కడే ఉంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 144 సెక్షన్ శుక్రవారం కొనసాగింది.
ఆధార్ ఉంటే తప్ప జైనూర్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. శుక్రవారం నుంచి గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభంకానుండగా, పోలీసులు మరింత బందోబస్తు పెంచే అవకాశమున్నది. జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.