వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్.. భద్రాచలం సబ్‌జైలుకు తరలింపు
Vanama Raghava | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు శనివారం ఉదయం హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు శనివారం ఉదయం హాజరుపరిచారు. విచారణ అనంతరం రాఘవకు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో వనమా రాఘవను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం తానేనని వనమా రాఘవ పోలీసుల ముందు ఒప్పుకున్నాడని ఏఎస్పీ రోహిత్ తెలిపిన విషయం తెలిసిందే. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వనమా రాఘవ కేసుకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్.. వనమా రాఘవపై ఈ కేసుతో పాటు మరో 12 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు.
రామకృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత విచారించాం. విచారణలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తానే కారణం అని రాఘవ ఒప్పుకున్నాడు. దీనితో పాటు ఇతర కేసులపై కూడా విచారించాం. చాలా విషయాలు తెలిశాయి. అవన్నీ తరువాత మీడియాకు తెలియజేస్తాం అని ఏఎస్పీ వెల్లడించారు.
అసలేం జరిగింది..?
పాత పాల్వంచలో ఈ నెల 3న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నాగ రామకృష్ణ, అతడి వైఫ్ శ్రీలక్షి. కూతుళ్లు. సాహితి. సాహిత్య. ఈ నలుగురు చనిపోయారు. ఈనెల 3న ఉదయం రామకృష్ణ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ మీద పెట్రోల్ పోసి అంటించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్ద కూతురు సాహిత్య.. 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయింది. రామకృష్ణ బావమరిది జనార్ధన్ రావు ఫిర్యాదు ఆధారంగా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. సాహిత్య కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఘటనాస్థలిలో లభించిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్ ద్వారా వనమా రాఘవ, తన తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు సూసైడ్ నోట్లో రాసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. వనమా రాఘవేంద్ర అనే వ్యక్తి డబ్బులే కాకుండా తన భార్యను కూడా ఆశించాడని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

