హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. 34 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 13 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 13 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన ప్రక్రియను పూర్తిచేసింది. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని సమాచారం. గత డిసెంబర్లోనే ఆయా అధికారులకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) స్క్రీనింగ్ నిర్వహించారు. ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అప్పటినుంచి వారు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరు నెలల నిరీక్షణ తరువాత ప్రభుత్వం బదిలీ ప్రక్రియ చేపడుతున్నది.