జోరు వానలు.. రాష్ట్రంలో అత్యధికంగా కంకోల్లో 13 సెంటీమీటర్లు
జోరు వానలు| రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో 13 సెంటీమీటర్లు నమోదైంది.

హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో 13 సెంటీమీటర్లు నమోదైంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మెండోరాలో 12.4 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రాలో 11.8, నిజామాబాద్ జిల్లా వాయిల్పూర్లో 11.5, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 11.4, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 11.3, ఏర్గట్లలో 11.1, మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో 10.9, ఉప్పల్ రాజీవ్‌నగర్‌లో 10.8, ఖమ్మం జిల్లా వేంసూరులో 10.8, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కిలో 10.5, జగిత్యాల జిల్లా సిరికొండలో 10.5, నిర్మల్ జిల్లా కడెం పెద్దూర్లో 10.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా, ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్‌లోని పొచ్చెర జలపాతం పొంగిపొర్లుతున్నది.
నేడు, భారీ వానలు
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఉత్తర ఒడిశా నుంచి ఇంటీరియర్ ఒడిశా వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద బుధవారం ఏర్పడిన ఉపరితల ద్రోణితోపాటు మంగళవారం ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడటంతో రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది.
ఇవి కూడా చదవండి..
యూరో కప్: ఫైనల్లో ఇటలీతో తలపడనున్న ఇంగ్లండ్
కేంద్రం మంత్రిగా కిషన్‌రెడ్డి నేడు బాధ్యతల స్వీకరణ
హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత
మోదీ క్యాబినెట్ విస్తరణ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్?!
దిలీప్ కుమార్ కన్నుమూత.. ఒక శకం ముగిసిందంటూ సెలబ్స్ ట్వీట్స్
ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కొవిడ్ మరణాలు : డబ్ల్యూహెచ్‌వో
చౌటుప్పల్‌లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి తల్లి బలవన్మరణం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Kankol
- Nizamabad
- Rains
- Sangareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

