e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home తెలంగాణ సురవరంతోనే దశదిశలా తెలంగాణ సాహితీకీర్తి

సురవరంతోనే దశదిశలా తెలంగాణ సాహితీకీర్తి

సురవరంతోనే దశదిశలా తెలంగాణ సాహితీకీర్తి
  • ప్రతాపరెడ్డి సేవలను స్మరించుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ఏడాదిగా 125వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్‌, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి (మే 28)ని పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆయన సేవలను స్మరించుకొన్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పరిశోధకుడిగా తెలంగాణ జాతి సాహితీకీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన రాజకీయ సాంఘిక సాహిత్య వైతాళికుడాయన అని కొనియాడారు. పురాణాలను, చరిత్రను, సామాజిక చైతన్యాన్ని, సాహితీ సృజనను వినూత్న కోణంలో ఆవిషరించి, తెలంగాణ వైభవాన్ని లోకానికి సాధికారికంగా సత్ప్రమాణాలతో నిరూపించారని అన్నారు. గోలకొండ పత్రిక ద్వారా సురవరం తీసుకువచ్చిన జన చైతన్యం స్ఫూర్తిదాయకమైనదని చెప్పారు. హిందూ జీవనవిధానంలో అంతర్భాగమైన పండుగలు, సంప్రదాయాల్లో నిగూఢంగా ఉన్న విలువలను శాస్త్రీయంగా వెలుగులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డిదని సీఎం తెలిపారు. రామాయణంలోని ఎన్నెన్నో తెలియని కోణాలను సోదాహరణంగా వివరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని శ్లాఘించారు. తెలుగు ప్రజల సాంఘిక చరిత్రను ఆధారాలతో సహా నమోదుచేసిన ఆ ఘనత సురవరం గారికే దకిందని కేసీఆర్‌ పేరొన్నారు. తెలంగాణలో పండితులు, పద్యకవులు లేరనే మాటను సవాలుగా తీసుకొని గోలకొండ కవుల సంచికను ప్రత్యేకంగా ముద్రించారని.. తద్వారా తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణావాది అని సీఎం అన్నారు. తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి సురవరం ప్రతాపరెడ్డి అని కీర్తించారు. తన రచనల ద్వారా తెలంగాణ సమాజానికి అందించిన స్ఫూర్తి తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమని అన్నారు. సురవరం 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏడాదిగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

సురవరంతోనే దశదిశలా తెలంగాణ సాహితీకీర్తి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సురవరంతోనే దశదిశలా తెలంగాణ సాహితీకీర్తి

ట్రెండింగ్‌

Advertisement