హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారి లైసెన్స్‌ను సైతం రద్దు చేసేందుకు వెనుకాడటం లేదు. ముఖ్యంగా అధిక వేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. ఈక్రమంలోనే 2024-25లో 12,184 డ్రైవింగ్ లైసెన్సులను రద్దుచేసింది. 2024-25లో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు, ఆటోలు, గూడ్స్ వాహనాలను తనిఖీలు చేసి రూ.165.09 కోట్లను స్వాధీనం చేసుకున్నది.