హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ సైనిక సంక్షేమశాఖలో డ్రైవర్ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీజీఎస్ఆర్టీసీలో 1201డ్రైవర్ పోస్టులకు సైనిక సంక్షేమశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల వేతనం, రోజువారీ అలవెన్స్ రూ.150 చెల్లిస్తారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సైనిక సంక్షేమశాఖ సూచించింది. మాజీ సైనికుల్లో హెవీ డ్యూటీ లైసెన్స్ కలిగి, 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉన్న వారు దరఖాస్తులకు అర్హులు. వయస్సు 58 కన్నా తకువ ఉండాలి. ఎత్తు 160 సెం.మీ కంటే తకువ ఉండకూడదు. ఆసక్తి గల మాజీ సైనికులు దరఖాస్తును 30వ తేదీలోపు porsb-ts@ nic. in,emprsb-ts@nic.in కు మెయిల్ చేయాలని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ తెలిపారు.