హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)కు చెందిన 120 మంది విద్యార్థులు, సిబ్బంది గడిచిన వారంలో కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులనూ సైతం నిలిపివేస్తున్నట్లు ఐఐటీ హైదరాబాద్ తెలిపింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
సెమిస్టర్ ముగింపు విరామం అనంతరం ఈ నెల ప్రారంభంలో సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న క్యాంపస్‌కు విద్యార్థులు తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొంత మంది విద్యార్థుల్లో కొవిడ్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో 120 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలగా.. ఇందులో 107 మంది విద్యార్థులు, మిగతా వారిలో ఫ్యాకల్టి, ఇతర సిబ్బంది ఉన్నారు. పాజిటివ్‌గా తేలినవారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు.