ఆదేశాలు జారీచేసిన ఎస్సీఈఆర్టీ
ప్రత్యేకంగా మెటీరియల్ తయారీ
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఒకటో తరగతి పిల్లల కోసం 12 వారాల పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. 12 వారాల్లో 60 రోజులపాటు కృత్యాల ద్వారా పలు అంశాలను నేర్పిస్తారు. ఈ మేరకు పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రాధారెడ్డి ఆదేశించారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ఒకటో తరగతిలో చేరే పిల్లలకు భిన్న నేపథ్యాలు ఉంటాయి.
కొందరు పూర్వ ప్రాథమిక కేంద్రాల నుంచి, మరికొందరు అంగన్వాడీలు, ఇంకొందరు నేరుగా ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందుతారు. వారు బడి వాతావరణానికి అలవాటు పడటానికి, అభ్యసించేందుకు, సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. అందుకే 12 వారాల ప్రిపరేటరీ క్లాసులు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కరదీపికను సిద్ధంచేశారు. ఏ రోజు ఎలాంటి కృత్యాలు నిర్వహించాలి, బోధించాలో కరదీపికలో పొందుపరిచారు.
ఇవి చేపడుతారు..